NTV Telugu Site icon

Vishal v/s Prakash Raj: విశాల్ ట్వీట్‎కు వ్యంగ్యంగా బదులిచ్చిన ప్రకాశ్ రాజ్

New Project (20)

New Project (20)

Vishal v/s Prakash Raj: వర్సటైల్ హీరో విశాల్ ఇటీవల కాశీ క్షేత్రాన్ని దర్శించారు. కాశీ పుణ్యక్షేత్రం పునర్వైభవాన్ని చూసి ఆయనకు కలిగిన ఆనందాన్ని తెలియపరుస్తూ ట్విట్టర్ ద్వారా ప్రధానికి కృతజ్ఞతలను తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. కాశీ ఆలయాన్ని అంతలా అద్భుతంగా తీర్చిదిద్దిన తీరుపై ట్విటర్ ద్వారా పొగడ్తల వర్షం కురిపించారు. విశాల్ చేసిన ట్వీట్ లో ‘ప్రియమైన మోదీజీ నేను కాశీ దర్శించాను.. అక్కడ అద్భుతంగా దర్శనం జరిగింది. గంగానది పవిత్ర జలాన్ని తాకింది. ఆలయాల పునరుద్ధరించడం ద్వారా మీరు చేసిన పరివర్తనకు దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు గతం కంటే అద్బుతంగా కాశీ కనిపిస్తోంది.. ఇప్పుడు కాశీప్రయాణం కూడా సులువుగా మారింది.. అందుకు మీకు నమస్కరిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు.

ఈ మేరకు ప్రధాని రిప్లై ఇస్తూ… మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా ఉందన్నారు.

ఇలా ట్విటర్ ద్వారా జరిగిన కన్జర్వేషన్‎లో హీరో విశాల్ చేసిన ట్వీట్ కు యాక్టర్ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.. షాట్ ఓకే నెక్ట్స్ ..? అంటూ ట్వీట్ చేయడంపై నెటిజన్లు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై ఆయనను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Show comments