NTV Telugu Site icon

Prakash Javadekar : మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందింది

Praksh

Praksh

దేశంలో 30 ఏళ్ల తరవాత సుస్థిర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఏర్పడిందని మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేళ్ల మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి భేదభావం లేకుండా అభివృద్ధి ఫలాలు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ పాలన కుటుంబ పాలన కాదు… అవినీతి పాలన కాదు.. ఈ తొమ్మిదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం మోడీది అని ఆయన అన్నారు. స్వతంత్ర భారత దేశంలో అవినీతి మరక అంటని మొదటి ప్రభుత్వమని ఆయన అన్నారు. అంతేకాకుండా..

Also Read : Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ

‘మోడీ పాలనలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది.. అభివృద్దికర పాలన… 24 గంటలు ప్రజలకోసం పని చేస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ కోసం పోరాడింది బీజేపీ… ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో పనిచేసాం.. ప్రజల్లో చట్టసభల్లో బీజేపీ తెలంగాణ కోసం పోరాటం చేసింది.. బీజేపీ సర్కార్ ఎలాంటి వివక్ష.లేకుండా కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇచ్చాం… రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేశాం… రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం… కిసాన్ సమ్మన్ అమలు చేస్తున్నాం.. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రధమ స్థానంలో ఉన్నాం.. ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలుకు నిధులు ఇస్తున్నామని ఆయన అన్నారు.