NTV Telugu Site icon

Prakash Javadekar : అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదు

Prakash Javadekar

Prakash Javadekar

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. ఉదయనిధి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు చేసి ఐదు రోజులు దాటిందన్నారు. ఉదయనిధి పార్టీ కాంగ్రెస్ కూటమిలోనే ఉంది కదా? రాహుల్ గాంధీ కూడా సైలెంట్ గా ఉన్నారని, ఆ కూటమిలో ఒకరు.. దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించారని అన్నారు.

Also Read : Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు

అందుకే రాహుల్ తన మౌనం వీడి దీనిపై మాట్లాడాలన్నారు ప్రకాశ్ జవదేకర్. దేశ ప్రజలంతా ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్నారని, ఖర్గే కూడా దీనిపై స్పందించాలన్నారు. ఉదయనిధి సనాతన ధర్మాన్ని మాత్రమే అవమానించలేదు.. అన్ని ధర్మాలను అవమానించారని, ఆయన డిగ్నిటీ కాపాడుకోవాలని, భారత్ పేరుపై అంత రాద్దాంతం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. భారత్ అనేది గతంలో నుంచి ఉన్న పదమే కదా, కోల్‌కత్తాను కలకత్తా.. చెన్నై.. మద్రాస్.. ముంబై.. బాంబే.. ఇవన్నీ మారాయి కదా అని ఆయన అన్నారు. భారత్ పదం మనది అని, ఎప్పటి నుంచో భారత్ మాతా కి జై అంటున్నామని, భారత్ ప్రెసిడెంట్ అంటే వచ్చిన నష్టం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Lalu Prasad Yadav: వేపపుల్లలో ఇండియా, భారత్‌ల మధ్య తేడాను వివరించిన లాలూ.. ఓల్డ్ వీడియో వైరల్..