Site icon NTV Telugu

Prakash Ambedkar : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రకాష్‌ అంబేద్కర్‌

Prakash Ambedkar

Prakash Ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ శుక్రవారం బేగంపేటలో మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగింపల్లి సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. తనను కలిసే ముందు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తాతయ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని ప్రకాష్‌ అభినందించారు. మానవాళిలో సమానత్వం – ప్రకృతిలో సమతుల్యత కోసం పాటుపడిన తాత అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం నాకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.

Also Read : Sai Dharam Tej: మెగా మేనల్లుడు పంచెకట్టు వెనుక ఉన్న మతలబు క్యా హై..?

ఆయన మాట్లాడుతూ, “మా తాత, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తనను కలిసే ముందు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరుకున్నారు. తోటల పెంపకంపై ఆయన ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కనబరిచేవారు. ఇన్నేళ్ల తర్వాత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మళ్లీ అదే స్ఫూర్తిని చూస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది సంతోష్ కుమార్ ప్రారంభించిన భారీ ప్లాంటేషన్ కార్యక్రమం. భారతదేశం అంతటా మొక్కలు నాటడం మరియు గ్రీన్ కవర్ సృష్టించడం కోసం ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.’ అని ఆయన అన్నారు. సంతోష్ కుమార్ చేసిన కృషిని ప్రకాష్ అంబేద్కర్ ఎంతో ప్రశంసించారు, ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రవేశించినందుకు బృందాన్ని అభినందించారు.

Also Read : Hema Malini : ‘ఐ యామ్ సారీ’ అంటున్న బాలీవుడ్ డ్రీమ్ గర్ల్

“బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమం కోసం రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేసిన అవిశ్రాంతమైన కృషి ఎంతో అభినందనీయం. సంతోష్ కుమార్ కృషికి మరింత గుర్తింపు రావాలి, ప్రకృతి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, ”అని ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు. హరిత మరియు పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సృష్టించే లక్ష్యం కోసం దోహదపడుతూ చొరవలో భాగంగా పాల్గొనేవారు మొక్కలు నాటారు.

Exit mobile version