Hema Malini : అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. అప్పట్లో కుర్రకారు హేమ అంటే పడిచచ్చేవారు. ఆమె ఎక్కువగా సింపుల్ లైఫ్ గడపటానికి ఇష్టపడతారు. కుటుంబంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పటికీ ఆమె ఓ సాధారణ మనిషిలాగానే జీవిస్తుంది. అలాంటి ఆమె ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం.. ‘బిహు’ అనేది అస్సాంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. పలువురు రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు తమ ట్విటర్‌లో అక్కడి ప్రజలకు బిహు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మధుర ఎంపీ హేమ మాలిని కూడా ఈ పండుగ సందర్భంగా అస్సాం ప్రజలకు ‘బిహు’ బీహార్ పండుగ (హేమ మాలిని పొరపాటు) అని శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన తప్పుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మరోసారి ‘ఐ యామ్ సారీ’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Yash: ఓ అన్నా.. అసలు సినిమా చేసే ఉద్దేశ్యం ఉందా..?
హేమ మాలిని, బిహూ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రస్తుతం పంట కాలం కొనసాగుతోంది. తమిళ్ పుతాండు (నూతన సంవత్సరం), బైసాఖి (పంజాబ్), బిహు (బీహార్) (హేమ మాలిని తప్పు), పోహెలా బైసాఖ్ లేదా నబ వర్ష (బెంగాల్) వంటి పేర్లతో వివిధ రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటారు. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు’ అని అన్నారు. ఈ ట్వీట్‌ను నెటిజన్లు బీజేపీ నేత హేమమాలిని దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ‘విద్య’ అనేది జీవితంలో ముఖ్య భాగం! బిహు అనేది అస్సాం పండుగ, బీహార్ కాదు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన హేమ మాలిని తన తప్పుకు క్షమాపణలు చెబుతూ మళ్లీ ట్వీట్ చేశారు. ఇందులో ఆమె ‘పొరపాటున ‘బిహు’ అని బీహార్‌లో జరుపుకునే పండుగ అని చెప్పాను. నన్ను క్షమించండి! అస్సాంలోని ఈ పండుగ బిహూ అంటూ చదువుకోవాలని ఆమె వివరణ ఇచ్చారు.