NTV Telugu Site icon

Prakasam Earthquakes: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు భూప్రకంపనలు!

Earthquake

Earthquake

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలో సోమవారం ఉదయం 10:24 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దంతో భూమి కంపించటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరులో ఆదివారం ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి.

Also Read: Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!

గత మూడు రోజులుగా ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. వరుసగా మూడోరోజు భూప్రకంపనలు రావడంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భూ ప్రకంపనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు.

Show comments