Prajwal Revanna’s Brother: మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుండగా.. తాజాగా అతడి సోదరుడు ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు చేసింది ఓ యువకుడు.. తనపై ఎమ్మెల్సీ సూరజ్ అత్యారానికి పాల్పడినట్లు హసనకు చెందిన జేడీఎస్ కార్యకర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తాను ఒప్పుకోకపోయినా బలవంతంగా అసహజ లైంగిక ప్రక్రియలో పాల్గొన్నాడని పేర్కొన్నాడు. తనను వేధింపులకు గురి చేస్తోన్న ఎమ్మెల్సీ.. చంపేసేందుకు ట్రై చేస్తున్నాడని డీజీపీ, హోం మంత్రి, జిల్లా ఎస్పీకి అతడు లేటర్ రాశాడు.
Read Also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
ఇక, అరకలగూడుకు చెందిన జేడీఎస్ కార్యకర్త చేతన్ తనపై జరిగిన లైంగిక దాడి గురించి 15 పేజీల లేఖలో తెలియజేశాడు. జాబ్ ఇప్పిస్తానని, ఆర్థికసాయం చేస్తామని నమ్మించి తనపై ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో యువకుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, అతడి ఆరోపణలపై ఆధారాలను సేకరిస్తున్నట్టు హసన ఎస్పీ మహ్మద్ సజీదా వెల్లడించారు.
Read Also: AI Technology: త్వరలో ఏఐ- ఆధారిత శృంగార రోబోలు..
కాగా, ఎమ్మెల్సీ సూరజ్ అనుచరుడు సదరు యువకుడిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశాడు.. లేకపోతే అత్యాచారం చేసినట్టు కేసు పెడతానని మమ్మల్ని బెదిరించినట్టు శుక్రవారం రాత్రి హోళినరిసిపురం పీఎస్ లో కేసు పెట్టాడు. జూన్ 16వ తేదీన గన్నికొండ ఫామ్‌హౌస్‌కు వచ్చి తనను కలిసిన చేతన్.. తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరాడని ఎమ్మెల్సీ అనుచరుడు శివకుమార్ చెప్పారు. దీంతో సూరజ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన్ను కలవాలని తెలిపా.. ఆ తర్వాత నుంచి ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడని అతడు ఆరోపించారు. సదరు యువకుడు ఫామ్‌హౌస్‌కు వచ్చినప్పుడు పోలీసులతో పాటు చాలా మంది అక్కడే ఉన్నారని కంప్లైంట్ లెటర్లో పేర్కొన్నాడు.