NTV Telugu Site icon

Ka Paul: దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ నాపై పోటీ చేయాలి..

Ka Pal

Ka Pal

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానని.. తనను గెలిపించండని కోరారు. తనను ఓడించడానికి పురందేశ్వరికి, జీవీఎల్ కు రూ. 1200 కోట్లు ఖర్చు చేయమని మోడీ చెప్పారని తెలిపారు. మరోవైపు.. వైజాగ్ లో వెయ్యి కోట్లు ఖర్చుచేసి తనను ఓడించాలని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ తనపై వైజాగ్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు నెలల క్రితం జేడీ లక్ష్మీనారాయణను కలిశానని.. జేడీని తనతో కలిసి రమ్మని అడిగినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన తనను వెయ్యి కోట్లు అడిగారని కేఏ పాల్ చెప్పారు.

ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేఏ పాల్ అన్నారు. బాలయోగికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. తనకు భారతరత్న ఇస్తానన్నారు.. కానీ తానే తీసుకోలేదని చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నీకెందుకు ఈ ఖర్మ.. మెగా బ్రదర్స్ ప్రజారాజ్యం పేరుతో మంచి పార్టీ పెట్టారు. అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని విమర్శించారు. 20 సీట్లు తీసుకోవడానికి మేం కుక్కలమా అన్నావని.. మరెందుకు ఇప్పుడు పాతిక సీట్ల కోసం పాకులాడుతున్నావ్..? అని ప్రశ్నించారు. చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాబట్టే పద్మభూషణ్ , పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు బిల్ గేట్సును పరిచయం చేసింది తానేనన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ నిజాన్ని ప్రజలకు చెప్పాలని తెలిపారు.

మరోవైపు.. తనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ తనను కొట్టించారన్నారు. వారు చిత్తుచిత్తుగా ఓడిపోతారని చెప్పా ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్నారు. తనకు చావంటే భయం లేదని.. చావుకే తానంటే భయమని అన్నారు. ఏపీలో పార్టీలన్నీ మోడీ తొత్తులేనని విమర్శించారు. పురందేశ్వరి చాలా మంచి వ్యక్తి.. ఆమె కూడా మోడీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. చంద్రబాబు మంచి హీరో అనుకున్నానని.. చంద్రబాబు జైలుకెళ్లాక ఆయనపై 60 కేసులున్నాయని తెలిసిందని అన్నారు. 60 కేసులున్నాయి కాబట్టే.. మళ్లీ జైల్లో పెడతారానే భయంతో చంద్రబాబు అమిత్ షాను కలిశాడని కేఏ పాల్ ఆరోపించారు.