NTV Telugu Site icon

KA Paul: చంద్రబాబు ఇంటి దగ్గర కేఏ పాల్ హల్ చల్.

Ka Paul

Ka Paul

KA Paul: ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. మరికొందరు ముఖ్యనేతల సమావేశం జరుగుతోన్న సమయంలో.. చంద్రబాబు ఇంటి దగ్గర హల్‌చల్‌ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్లు ఉండాలి.. కానీ, ఇప్పుడు ఒక్కరే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు జరుపకూడదని తెలిపారు..

Read Also: Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ

మరోవైపు కాపులు అంత ప్రజాశాంతి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు కేఏ పాల్.. అంతేకాదు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభంకు కూడా హ్వానం పలికారు.. ఆయన మళ్లీ ఆలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని అభిప్రాయపడ్డారు పాల్.. ఇక, ”పాల్ రావాలి.. పాలన మారాలి..” అంటూ కొత్త నినాదం చేశారు.. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు బాబు మోహన్ నా పార్టీలోకి వచ్చాడని గుర్తుచేసిన ఆయన.. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నన్ను కలవండి.. నేను ప్రజాశాంతి పార్టీ టికెట్లు ఇస్తానంటూ ఓపెన్‌ ఆఫర్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కాగా, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ప్రజాశాంతి పార్టీలో చేరాలంటూ పాల్ ఆహ్వానించిన విషయం విదితమే.