NTV Telugu Site icon

Pragyananda Defeat Carlsen: సంచలనం.. కార్ల్‌సెన్‌ పై ప్రజ్ఞానంద తొలి విజయం..

Pragyananda Defeat Carlsen

Pragyananda Defeat Carlsen

Pragyananda Defeat Carlsen: స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ సందర్భంగా క్లాసికల్ గేమ్‌ లో రమేశ్‌బాబు ప్రగ్నానంద ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ ను మొదటిసారి ఓడించాడు. 18 ఏళ్ల ఈ భారత గ్రాండ్‌ మాస్టర్ కార్ల్‌సెన్‌ ను తన సొంతగడ్డపై తెల్లటి పావులతో ఆడి ఓడించాడు. దాంతో 5.5 పాయింట్లతో సిరీస్ ఆమోదటి స్థాననికి చేరుకున్నాడు. కార్ల్‌సెన్, ప్రజ్ఞానంద ఈ ఫార్మాట్‌లో వారి ముందు మూడు గేమ్ లను డ్రా చేసుకున్నారు. వాటిలో రెండు 2023 ప్రపంచ కప్ ఫైనల్‌ లో జరిగినివి.

Bujji and Bhairava Animated: బుజ్జి, భైరవ చేసిన అడ్వెంచర్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూశారా..

బుధవారం రాత్రి, 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రగ్నానంద మాగ్నస్ కార్ల్‌సెన్‌ ను ఓడించాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ పై ప్రగ్నానంద విజయం సాధించిన తర్వాత, సోషల్ మీడియాలో అభినందన పోస్టులతో నిండిపోయింది. భారతదేశం నుండి తాజా ప్రపంచ సంచలనం.. అంటూ ఒక అభిమాని X లో రాసుకొచ్చాడు. ఈ సందర్బంగా అనేక మంది ప్రముఖులు సంచలనం సృష్టించిన ప్రగ్నానందకు విషెస్ తెలుపుతున్నారు.