Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్‌మేట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praggnanandhaa – Magnus Carlsen: నార్వే చెస్ టోర్నమెంట్ 2026లో ప్రపంచ నంబర్ వన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)పై భారత గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత విజయాన్ని సాధించాడు. ఓస్లోలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరును ప్రగ్యానంద “క్రేజీ ఫైట్”గా అభివర్ణించాడు.
2024 నార్వే చెస్ టోర్నమెంట్లో కార్ల్సెన్పై తన గత విజయంతో పోలిస్తే ఈసారి మ్యాచ్ పూర్తిగా భిన్నంగా సాగిందని ప్రజ్ఞానంద మ్యాచ్ అనంతరం మాట్లాడారు. గతసారి నేను గేమ్‌పై చాలా నియంత్రణలో ఉన్నాను. కానీ, ఈసారి ప్రారంభం నుంచే ఆట ఉత్కంతంగా మారింది. ఒక దశలో మేమిద్దరం కూడా పరిస్థితిపై పట్టు కోల్పోయామని తెలిపారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
రౌండ్ 3లో తెలుపు పావులతో ఆడిన ప్రజ్ఞానంద, 46 ఎత్తుల్లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్సెన్ను ఓడించాడు. ముఖ్యంగా 44వ ఎత్తులో కార్ల్సెన్ చేసిన భారీ తప్పిదం మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. ఆ తప్పిదం జరిగిన రెండు ఎత్తులకే కార్ల్సెన్ ఓటమిని అంగీకరించాడు. మ్యాచ్ అనంతరం కార్ల్సెన్ నిరాశ వ్యక్తం చేసిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఓటమితో అతను పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయాడు.
ఇప్పటికే తొలి రౌండ్లో అలిరెజా ఫిరౌజ్జా చేతిలో ఓడిన కార్ల్సెన్, రెండో రౌండ్లో విన్సెంట్ కీమర్‌పై ఆర్మగెడ్డాన్ టైబ్రేక్ ద్వారా గెలిచాడు. అయితే ప్రగ్యానంద చేతిలో తాజా ఓటమితో నార్వే చెస్ టైటిల్ ఆశలు దెబ్బతిన్నాయి. ఇక ప్రగ్యానంద 4.5 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్లో వెస్లీ సోపై ఆర్మగెడ్డాన్లో గెలిచిన అతను, రెండో రౌండ్లో ప్రస్తుత టోర్నమెంట్ లీడర్ అలిరెజా ఫిరౌజ్జా చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు వెస్లీ సో కూడా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఆర్మగెడ్డాన్లో ఓడించిన వెస్లీ, మూడో రౌండ్లో విన్సెంట్ కీమర్‌పై టైబ్రేక్ ద్వారా విజయం సాధించి 4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ప్రస్తుతం 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కీమర్ పై ఆర్మగెడ్డాన్ విజయం సాధించిన గుకేష్, తదుపరి రెండు రౌండ్లను కూడా టైబ్రేక్లకు తీసుకెళ్లినా విజయం సాధించలేకపోయాడు. ముఖ్యంగా మూడో రౌండ్లో ఫిరౌజ్జాతో జరిగిన పోరులో కఠినంగా పోరాడినప్పటికీ చివరకు ఓటమి చవిచూశాడు.
Oops, he did it again! 🔥🇮🇳#NorwayChess pic.twitter.com/7u54vE4GEZ
— Norway Chess (@NorwayChess) May 27, 2026
"The last one (Pragg's win over Magnus in Norway Chess 2024) was way better than this… this one, it was a crazy fight from the start!" – @rpraggnachess after defeating World no.1 Magnus Carlsen in Round 3 of @NorwayChess 2026.
Interview: @ram_abhyudaya/ ChessBase India pic.twitter.com/5HkkYA4oWO
— ChessBase India (@ChessbaseIndia) May 27, 2026
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?