Site icon NTV Telugu

Love Insurance: ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ డేట్ లీక్..

Love Insurance Kompany

Love Insurance Kompany

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, ‘డ్యూడ్ స్టార్’ ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన ప్రదీప్ నుంచి 2025లో రావాల్సిన మూడు చిత్రాల్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) ఒకటి. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రదీప్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్‌డేట్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే..

Also Read : Dhurandhar OTT: ఎట్టకేలకు ‘ధురంధర్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌పై ఫిలిం సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త లీక్ అయ్యింది. మేకర్స్ ఈ సినిమాను వచ్చే మార్చి నెల చివరి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిజానికి మార్చి నెలలో ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. అయినప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ప్రదీప్ సినిమాను ఆ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్స్, రౌడీ పిక్చర్స్ నిర్మిస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Exit mobile version