NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు

Prabas Fauji (1)

Prabas Fauji (1)

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా క‌నిపించ‌నున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Read Also:USAID Row: భారత్‌కి అమెరికా నిధులపై వాషింగ్టన్ పోస్ట్ కథనం.. బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ ఎటాక్..

ఇందులో సోషల్ మీడియా క్వీన్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఫౌజీలో ర‌జాకార్ల నేపథ్యంలో సాగే ఓ భారీ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవ‌నుంద‌ని టాక్. ఈ విష‌యం బ‌య‌టికొచ్చిన దగ్గర్నుంచి అంద‌రికీ ఫౌజీపై ఆసక్తి పెరుగుతుంది. ఫౌజీలో ర‌జాకార్ల ఎపిసోడ్ లో ఎమోష‌న్స్ కు, యాక్షన్ కు పెద్ద పీట వేయ‌బోతున్నట్లు దానికి సంబంధించిన సీన్లను మార్చిలో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో ఓ కీల‌క పాత్ర ఉంద‌ట‌.

Read Also:AP Assembly Budget Session: ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు స్పీకర్‌ కీలక భేటీ

దాని కోసం ఓ హాలీవుడ్ యాక్టర్ ను రంగంలోకి దింపుతున్నాడట డైరెక్టర్ హను.స‌ద‌రు న‌టుడు ఆ పాత్ర కోసం దాదాపు ఆర్నెళ్లుగా మేకోవ‌ర్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఆ హాలీవుడ్ యాక్టర్ ఎవరనేది మాత్రం చిత్ర బృందం త్వ‌ర‌లోనే అనౌన్స్‌చేయ‌నుంద‌ట. మొత్తానికి ఫౌజీ కోసం హ‌ను ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫౌజీలో ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని.. ఇంతకు ముందు సినిమాల్లో చూడ‌ని యాంగిల్ లో ప్రభాస్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.