క్రిస్మస్ పండుగ సందర్భంగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ‘రాజే యువరాజే..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ప్రోమోలో ప్రభాస్ వింటేజ్ లుక్, ఆ కలర్ ఫుల్ సెట్స్ చూస్తుంటే మళ్ళీ పాత ప్రభాస్‌ని చూస్తున్నట్టుగా ఉందని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. జనవరి 9న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండటంతో, ఇప్పటి నుంచే ప్రమోషన్ల జోరు పెంచేసింది చిత్ర యూనిట్.
Also Read : Yami Gautam-Aditya: ఆదిత్యతో తన క్యూట్ లవ్ స్టోరీ లీక్ చేసిన యామీ..
పాన్ ఇండియా లెవల్‌లో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లు అందాల సందడి చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సంక్రాంతికి ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేట మొదలు పెట్టడం ఖాయమని అర్థమవుతోంది.
