టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు లోక్ మూవీ లుక్ కూడా ఉన్నట్లు సమాచారం.
READ MORE: Kerala High Court: మహిళల శరీరాకృతి గురించి కామెంట్లు చేసినా లైంగిక వేధింపే..
ఇక ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఈ భారీ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దీనిపై అఫిషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. ఎప్పుడైతే ‘హోంబళే’ వారు ప్రభాస్ తో మూడు చిత్రాలు అనౌన్స్ చేసారో అప్పటి నుంచి వాటిలో ఒకటి మాత్రం ఖచ్చితంగా లోకేష్ కనగరాజ్ సినిమానే అని సోషల్ మీడియాలో గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ గురించి ఈ సంక్రాంతి కానుకగా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
READ MORE: ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు