The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఒక వినూత్నమైన పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కాస్త మొహమాట పడుతుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం ఆయన ఏకంగా ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ముచ్చటించబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో కేవలం ప్రభాస్, సందీప్ మాత్రమే ఉండరు. ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు, ప్రభాస్ వ్యక్తిగత విషయాలు, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
‘రాజా సాబ్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెరవనున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు మరియు ప్రభాస్‌ను కలిపి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ప్రశ్నలు అడగబోతున్నారని సమాచారం. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా చర్చించనున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ‘రాజా సాబ్’ గ్లింప్స్ చూస్తుంటే, డార్లింగ్ ఫ్యాన్స్‌కు ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ కాలం నాటి వింటేజ్ ప్రభాస్ మళ్ళీ కనిపిస్తున్నాడు. అందుకే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా అంతే సరదాగా, సందడిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ఒక వైబ్. మరి వీరిద్దరి మధ్య సాగే ఈ చిట్ చాట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!
