పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్‘. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయూయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ ఈసారి ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపిస్తూనే కథలో రొమాన్స్ మరియు భావోద్వేగాలను మునుపెన్నడూ చూడని విధంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Exclusive : యంగ్ హీరో కెరీర్ భారీ బడ్జెట్ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు
సాధారణంగా ప్రభాస్ అంటే మనకు ‘వర్షం’, ‘డార్లింగ్’ వంటి సినిమాల్లోని క్లాస్ రొమాన్స్ గుర్తొస్తుంది. కానీ ‘స్పిరిట్’లో మాత్రం వంగా మార్క్ బోల్డ్ అండ్ ఇంటెన్సివ్ రొమాన్స్ ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ బాడీపై గాయాలు, బ్యాండేజీలతో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండగా.. హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తున్నట్లు ఉన్న విజువల్స్ చూపిస్తూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉండబోతుందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఒక సంక్లిష్టమైన ప్రేమకథ కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉంటుందని ఫిలిం నగర్ టాక్. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరో పాత్రలను చాలా వైల్డ్ గా అలాగే లవ్ కోసం ఎంతకైనా తెగించేలా తీర్చిదిద్దుతారు. ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్ పాత్రలో ఒక కొత్త రకమైన ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ రొమాన్స్ చూడబోతున్నాం. ఇది ప్రభాస్ పాత ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసి ఒక సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయబోతున్నాడ వంగా. 2027 మార్చి 5 విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
