Site icon NTV Telugu

Prabhas: కృతిసనన్‌తో లవ్‌.. యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ నిజం చెప్పేశారు!

Prabhas

Prabhas

Prabhas: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ ఎపిసోడ్. బాలకృష్ణ-ప్రభాస్ మధ్య సాగిన సంభాషణలు అభిమానులను కట్టిపడేశాయి. గంటల క్రితమే విడుదలైన ఈ ఎపిసోడ్‌ నెట్టింట రికార్డు స్థాయి స్పందనతో స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం.

ఇక ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్‌గా సాగింది. బాలకృష్ణ అయితే ప్రభాస్‌ని పెళ్లి, ప్రేమ విషయాలు గురించి అడిగి ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి అడగా.. ‘రాసి పెట్టి లేదు సార్, లేదంటే ఈ పాటికి అయ్యిపోయేది’ అని బదులిచ్చాడు. దానికి బాలయ్య.. ‘మీ అమ్మకి చెప్పిన మాటలు నాకు చెప్పకయ్యా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో ఆదిపురుష్ కోస్టార్‌ కృతిసనన్‌తో డేటింగ్‌ లైఫ్‌ గురించి అడిగాడు బాలయ్య. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్‌షిప్‌ ఏమీ లేదని కృతిసనన్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని చెప్పాడు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌-కృతిసనన్‌ మధ్య ఉన్న అనుబంధంపై వస్తున్న వార్తలకు చెక్‌ పడ్డది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే రిలీజైన బాహుబలి పార్టు-1 ఎపిసోడ్‌ ఆహాలో సందడి చేస్తోంది.

అయితే పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​-హీరోయిన్​ కృతిసనన్​ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా వాటిపై స్పందించారు ప్రభాస్​. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని ప్రభాస్‌. “నువ్వు ఎంతోమంది హీరోయిన్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నావు. కానీ, రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు?” అని అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్య ప్రశ్నించగా.. “అది పాత వార్త. అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని మేడమ్‌(కృతిసనన్‌) ఇప్పటికే చెప్పేసింది కదా. ఆ వార్తల్లో నిజం లేదు. మీకు తెలియంది ఏముంది? ఏమీ లేకపోయినా అనవసరంగా ఇలాంటి గోల చేస్తున్నారు” అని ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చారు.

Rishabh Panth: రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు

నువ్వేమో నవ్వుతూ నో అంటున్నావు, ఆమె ఏమో సీరియస్‌గా నో అంటుంది. బయట నెట్టింట మాత్రం మీ మధ్య ఏదో ఉంది అంటుంన్నారు. ఏంటి సంగతి అని బాలయ్య అడగా.. ‘మీ టైంలో ఇంటర్నెట్ లేదు, మీకు ఏ ఇబ్బందులు లేవు. మాకు ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో అనవసరంగా రాస్తున్నారు’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్-సనన్ మధ్య ఏమీ లేదని ప్రభాస్ కూడా తేల్చేసాడు. అనంతరం తాను నటించిన పలు చిత్రాల గురించి ప్రభాస్ మాట్లాడారు.

Exit mobile version