NTV Telugu Site icon

Prabhas New Movie : మారుతితో సినిమాకు సిద్ధమవుతున్న డార్లింగ్‌

Prabhas Maruti

Prabhas Maruti

Young Rebel Star Prabhas Movie With Director Maruthi Will Start Shooting.
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుసగ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాహుబలి తరువాత ఆయన పాన్‌ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే.. భారీ బడ్జెట్‌లో కాకుండా మామూలు రేంజ్‌లో ఇప్పుడు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రస్తుతం ప్రాజెక్ట్‌ K, సలార్‌ షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న డార్లింగ్‌.. వీటితో పాటు మారుతి సినిమాను సైతం కంప్లీట్‌ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకే త్వరలోనే మారుతితో చేసే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమా మొత్త ఓ సినిమా థియేటర్‌ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమా కథ చెప్పగానే ఇందులో కొత్తదనం ఉందని వెంటనే డార్లింగ్‌ ఒకే చెప్పేశాడట. అయితే భారీ బడ్జెట్‌ సినిమాలకే అంకితమైన ప్రభాస్‌.. ఇప్పుడు లో బడ్జెట్‌ సినిమాతో ముందుకు రావడం అనేది ఇంకొంత మంది డైరెక్టర్లకు అవకాశం వచ్చే విషయం. ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకునే కొంతమంది చిన్న నిర్మాతలు భారీ బడ్జెట్‌ పెట్టలేక వెనుకడుగు వేస్తున్నారు. అయితే వారికి ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.

 

 

Show comments