Hero Prabhas Marriage: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు ‘ప్రభాస్’. యువ హీరోలు నిఖిల్, శర్వానంద్, వరుణ్ తేజ్.. తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారయ్యారు. అయితే 44 ఏళ్లు దాటినా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాదుగానే మిగిలిపోయారు. ‘రెబల్ స్టార్’ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్‌లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డార్లింగ్ బంధువులు, సన్నిహితులను అడిగినా.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి ఇప్పుడా? అని ఆయన ఫాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
అయితే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘డార్లింగ్స్.. చివరకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వెయిట్ చేయండి’ అని ప్రభాస్ కొద్ది నిమిషాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబుతున్నాడు, ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెబుతున్నాడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ తన వ్యక్తిగత జీవితం గురించా? లేదా సినిమా గురించా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Theaters Closed: రోజుకు 4 వేలు కూడా రావడం లేదు: విజయేందర్ రెడ్డి
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 AD’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా మంచు విష్ణు ‘కన్నప్ప’ సెట్‌లోకి ప్రభాస్ అడుగుపెట్టారు. ఇందులో నందీశ్వరుడి పాత్రలో డార్లింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయాల్సి ఉంది. ‘ఆపై మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చేయనున్నారు.
Prabhas Wedding