Site icon NTV Telugu

Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్‌స్టార్

Prabhas

Prabhas

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించిన “లవ్ రెడ్డి” సినిమాకు ఓ ప్రముఖ హీరో ఆదరణ లభించింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రోత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా తన మద్దతు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ పేర్కొన్నాడు.

READ MORE: Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి

లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేసిన రెబల్ స్టార్ ఆ చిత్రానికి అండంగా నిలవాలని తన అభిమానులను కోరాడు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు తమ సినిమాకు సపోర్ట్ చేయడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. హిరో మద్దతుపై సామాజిక సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version