NTV Telugu Site icon

Kalki 2898 AD: అమెజాన్‌ ప్రైమ్‌లో ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేటెడ్‌ సిరీస్‌!

Kalki 2898 Ad Animated Trailer

Kalki 2898 Ad Animated Trailer

Kalki 2898 AD Animated Trailer: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించగా.. దీపికా పదుకొణె కథానాయికగా నటించారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల ‘బుజ్జి’ కారును పరిచయం చేశారు.

బుజ్జితో కలిసి భైరవగా ప్రభాస్‌ చేసే సాహసాల్ని ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రూపంలో చిత్ర యూనిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌ శుక్రవారం నుంచి ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడీలో బుజ్జి, భైరవల వినోదం అందర్నీ బాగా అలరిస్తుందన్నాడు. సినిమా విడుదలకు ముందే సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నాడు.

Also Read: Prajawal Revanna : బెంగుళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ .. నేడు కోర్టులో హాజరు

‘కల్కి 2898 ఏడీలో బుజ్జి, భైరవల వినోదం అందరినీ అలరిస్తుంది. సినిమా విడుదలకు ముందే ఇలా సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా నిర్మాణ సంస్థ చేసిన సాహసోపేతమైన ప్రయోగం.ఈ చిత్రాన్ని యానిమేషన్‌ సిరీస్‌తో ప్రారంభించడం కొత్త విషయం. రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎంత కష్టమో మాకు తెలియదు. మేము ఈ సిరీస్‌ కోసం ఛోటా భీమ్‌ లాంటి యానిమేషన్‌ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్‌ గోల్డ్‌ సంస్థతో పని చేశాం. ఈ సినిమా కోసం మేము వైజయంతీ మూవీస్, వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్‌ అనే మూడు కంపెనీల్ని నడిపించాము’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపాడు.

 

 

Show comments