Site icon NTV Telugu

The Raja Saab : రెబల్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తున్న రాజా సాబ్

The Rajasaab Motion Poster

The Rajasaab Motion Poster

The Raja Saab : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అర డజన్ దాకా సినిమాలున్నాయి. వాటన్నింటిలోకి మొదట ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఐతే ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియా ముఖ్యంగా ఎక్స్ వేదికగా రెబల్ ఫ్యాన్స్ డైరెక్ట్ గానే రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. రెబల్ స్టార్ అభిమానులు అంతా కూడా రాజా సాబ్ అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటే.. వాళ్లని మరింత వెయిటింగ్ లో పెడుతుంది చిత్ర బృందం. సెట్స్ మీద ఉన్న సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటారు. అప్ డేట్స్ ఏంటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వాళ్లు చాలా నిరాశగా ఫీలవుతున్నారు. రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క మోషన్ పొస్టర్ ఇంకా ప్రభాస్ గ్లింప్స్ తప్ప మరో అప్ డేట్ ఏమీ రాలేదు. ఐతే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా నుంచి మినిమం రెస్పాన్స్ కూడా యూనిట్ ఇవ్వడం లేదు.

Read Also:Hyderabad: ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్, మేయర్

ఇటీవల మారుతి ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ రాజా సాబ్ అప్డేట్ అడిగినా ఎలాంటి సమాధానం రాలేదు. ఈ విషయంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా మారుతి వైపే తప్పు చూపిస్తున్నారు. స్టార్ ని హ్యాండిల్ చేయడం మారుతికి రాదని.. సినిమాను ఎంగేజ్ చేసేలా ప్రమోషనల్ అప్ డేట్స్ ఇవ్వాలని అది ఆయనకు తెలియదని ఎక్స్ లో రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళిని చూసి నేర్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. మారుతి రాజా సాబ్ విషయంలో అభిమానులను పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. రెబల్ ఫ్యాన్స్ విషయంలో మారుతి అండ్ టీం చాలా అశ్రద్ధగా ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:ACB Rides On KTR House: కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

Exit mobile version