Site icon NTV Telugu

Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!

Director Maruthi

Director Maruthi

Director Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తూన్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. ఈ నెల 29న సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2.0 ను మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇదే టైంలో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్.. ‘ది రాజాసాబ్’ సినిమా బాగుండటంతో ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు సరికొత్త రీతిలో తెలియజేశారు.

READ ALSO: Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది మీ కోసమే!

ఈ సినిమా ట్రైలర్‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వైరల్ రెస్పాన్స్ లభించడంతో… ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు తెలియజేడానికి ప్రభాస్ అభిమానులు సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి ఇంటికి చికెన్ బిర్యానీ పంపించారు. స్వయంగా ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో “డార్లింగ్స్… మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యం… ఇంటికి వచ్చిన వెంటనే ఇది చూశాను. #TheRajaSaabTrailer ప్రేమతో బిర్యానీ పంపినందుకు థాంక్స్. జనవరి 9న మరింత ఎక్కువ ఇస్తాం” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న హారర్-కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ 2.0లో ప్రభాస్ లుక్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను మస్త్ ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలో మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.

READ ALSO: PM Modi: వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Exit mobile version