Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘కల్కీ 2’, ‘రాజా సాబ్’, ‘సలార్ 2’ వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ‘సలార్ 2’ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కాస్త టైం పట్టేలా ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నాడు ప్రభాస్.
Read Also:35 Chinna Katha Kaadu : నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్.. ’35 చిన్న కథ కాదు’
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సలార్’. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య చెడిందని అందుకే ‘సలార్ 2’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. సెట్స్‌లో ప్రభాస్-ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నవ్వకుండా ఉండలేరని పరోక్షంగా పుకార్లను కొట్టిపారేసింది.
Read Also:Family Murder: ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలికొన్న అమ్మాయి
‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ గతేడాది డిసెంబర్‌లో విడుదలై ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో ‘శౌర్యంగ పర్వం’ పేరుతో రూపొందనున్న పార్ట్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం షూటింగ్ కొంతమేర ఎప్పుడో ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడు. బ్యాలన్స్ షూట్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉండగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ లీక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఇది చూసి రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. పార్ట్ 1 లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ స్ప్రెడ్ అవుతుంది. మొత్తానికి అయితే ఇది సలార్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేసిందనే చెప్పాలి.
#Salaar2 leaked pic 💥
Tunnel scene 🔥🔥
Like and RT for Pic 🥵🥵💥💥💥💥#Prabhas pic.twitter.com/4ASlJXF6vK
— greek_god (@Cinema_Here) October 6, 2024