Prabhas: జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు.
READ ALSO: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా యాంకర్ సుమా.. పలువురు దర్శకుల పేర్లు చెబుతూ.. వారి గురించి ‘ఒక్క మాటలో’ చెప్పమన్న ప్రశ్నకు డార్లింగ్ ప్రభాస్ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. రాజమౌళి.. తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ఆయనను ‘జీనియస్’ అని అభివర్ణించారు. అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను కూడా ప్రభాస్ జీనియస్‌గానే పేర్కొన్నారు. తెలుగు సినిమాలో పూరి ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించారని కొనియాడారు.
ప్రశాంత్ నీల్ గురించి చెబుతూ ‘బ్యూటిఫుల్ పర్సన్’ అని అన్నారు. అలాగే ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ‘స్ట్రాంగ్’ అని, ‘రాజా సాబ్’ డైరెక్టర్ మారుతిని ‘క్యూట్’ అని పేర్కొన్నారు. ఇక దర్శకుడు హను రాఘవపూడి ‘హార్డ్ వర్కింగ్’ అని, సుజిత్ ‘స్మార్ట్’ అని ప్రభాస్ చెప్పారు. ఇక యాంకర్ సుమా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ఎత్తగానే డార్లింగ్ అభిమానుల్లో కోలాహలం కనిపించింది. ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెబుతూ.. వంగా.. ఒక ‘కల్ట్’ అని అన్నారు. డార్లింగ్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘స్పిరిట్’. దీని గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచే వస్తున్నానని చెప్పారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక ‘కల్ట్’ అని, ఆయన కొత్త తరం దర్శకుడని ప్రభాస్ కితాబిచ్చారు.
READ ALSO: Gautam Gambhir: ‘టెస్టు’ కోచింగ్ మార్పుపై బీసీసీఐ క్లారిటీ..
