Salaar 2 : ఏంది సామి మూడు సినిమాలా? ‘సలార్ 2’తో స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థకు సైన్ చేశాడు డార్లింగ్. ఇప్పటికే ప్రభాస్ చేతిలో అరడజను వరకు సినిమాలున్నాయి. ది రాజాసాబ్, ఫౌజీ సెట్స్ పై ఉండగా.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 త్వరలో మొదలు కానున్నాయి. ఈ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్స్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ వేర్వేరు నిర్మాణ సంస్థలతో చేస్తున్నాడు. అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కానీ కెజీయఫ్, కాంతార, సలార్ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేశాడు ప్రభాస్. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు హోంబలే వారు.
Read Also:Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్లు ప్రకటించారు. ‘భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా మూడు చిత్రాల పార్ట్నర్షిప్లో ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్ అనుభూతిని సృష్టించడానికి వేదిక సిద్ధమైంది. సలార్2తో ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది.. సిద్ధంగా ఉండండి’ అని పేర్కొన్నారు. అలాగే.. ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయని తెలిపారు. అయితే.. సలార్ 2 పక్కన పెడితే.. నెక్స్ట్ రెండు సినిమాల దర్శకులు ఎవరు? మళ్లీ ప్రశాంత్ నీల్తోనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదంటే.. కెజియఫ్ 3లో ప్రభాస్ ఉంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఒకే సంస్థకు ప్రభాస్ మూడు సినిమాలు సైన్ చేయడం అంటే.. హోంబలే ఫిల్మ్స్ పై కోట్ల వర్షం కురుస్తుందనేది మాత్రం గ్యారెంటీ.
Read Also:Kishan Reddy: టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!