Site icon NTV Telugu

Adipurush : మే 9న ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్

New Project (37)

New Project (37)

Adipurush : మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ చిత్ర యూనిట్‌ సినిమాను ఈసారి అనుకున్న తేదీకి విడుదల చేసి తీరుతాం అని ప్రకటించారు. తాజాగా చిత్రానికి సంబంధించి మే 9న ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కొన్ని సెలెక్టెడ్‌ థియేటర్లో త్రీడీ ట్రైలర్‌ను కూడా ప్రదర్శించబోతోన్నారట. ఈ మేరకు అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆదిపురుష్‌ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read Also: Indias Gold Demand: పసిడికి భారీగా తగ్గిన గిరాకీ.. అసలు కారణం ఇదే..

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, థియేటర్‌లలో ఒకే రోజు ట్రైలర్ విడుదల అవుతోంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్‌ నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ సాధించింది. ఇప్పటికే విడుదలైన ప్రతి గ్లింప్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. అందుకే ఇది వరల్డ్ ఈవెంట్ గా మారింది.

Read Also:Nita Ambani : అంబానీ భార్య వాడే ఫోన్ ఖరీదుతో చార్టెర్డ్ ఫ్లైట్స్ కొనేయొచ్చట

Exit mobile version