ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్నారు.
Also Read:Hyderabad: ఇప్పట్లో ఆగేలా లేరే.. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి..
మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను ప్రణీత్ రావు టీమ్ 2023 లో 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసింది. ప్రణీత్ రావు ఫోన్ డేటలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. గద్వాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత నేడు సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత.. నేడు ప్రభాకర్ రావు సిట్ విచారణ, రేపు ప్రణీత్ రావును సిట్ విచారించనున్నది. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్‌తో తిరిగి వచ్చారు.
