Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ అమర్చి అనుచితంగా వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు ఫ్లోర్ అటెండెంట్‌గా పనిచేస్తున్న భరత్‌ను అరెస్ట్ చేశారు. కేసు సున్నితమైనది కావడంతో లోతైన విచారణ నిమిత్తం గాంధీనగర్ ఠాణా నుంచి సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళ అక్టోబర్ 13 ఉదయం 10:30 గంటల సమయంలో ఆరో అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ కమోడ్‌కు ఎదురుగా ఉన్న వాష్‌బేసిన్ కింద తెల్ల కాగితంతో కప్పి ఉన్న ఓ వస్తువుకు రెండు రంధ్రాలు కనిపించాయి. తొలుత దానిని రూమ్ ఫ్రెషనర్‌గా భావించిన ఆమె, అనుమానం వచ్చి పరిశీలించగా గోడకు డబుల్ సైడెడ్ టేప్‌తో మొబైల్ ఫోన్ అతికించి ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు.
Also Read
- Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
- TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
- Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
సదరు ఫోన్‌ను తీసుకుని బయటకు వచ్చిన ఆమె, అదే అంతస్తులో విధులు నిర్వర్తిస్తున్న అటెండెంట్ భరత్‌ను దీనిపై ప్రశ్నించారు. దీంతో అతడు ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే ఆమె హెచ్చరించడంతో హెచ్ఆర్ విభాగం, భద్రతా సిబ్బంది అతడిని ప్రధాన ద్వారం వద్ద పట్టుకున్నారు. ఫోన్లోని వీడియోలను పరిశీలించేందుకు సిబ్బంది ప్రయత్నించగా, ఫోల్డర్‌కు పిన్ లాక్ కనిపించింది. పాస్వర్డ్ చెప్పాలని నిలదీయడంతో, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితుడు ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. ఆ అంతస్తులోని వాష్‌రూమ్‌ను సుమారు ఆరుగురు మహిళా ఉద్యోగులు వాడుతున్నారని, ఈ ఘటనతో వారంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యారని బాధితురాలు పేర్కొన్నారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపి అందులోని సమాచారాన్ని వెలికితీయాలని, ఈ వ్యవహారంలో భరత్‌తో పాటు ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో తేల్చాలని డిమాండ్ చేశారు. తొలుత గాంధీనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 77, 238తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66-E కింద కేసును రీ-రిజిస్టర్ చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!