పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది.DVV ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
Also Read : Tollywood : టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా నేడు OG కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. అందుకు LB స్టేడియం ముస్తాబవుతోంది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG ట్రైలర్ ను ఈ రోజు ఉదయం 10.08 కి రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. దాంతో OG ట్రైలర్ కోసం పవన్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసారు. కానీ వారి ఎదురుచూపులకు నిరాశ కలిగించారు మేకర్స్. ఈ ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేసారు. ఈ రోజు సాయంత్రం జరగబోయే కాన్సర్ట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు నిర్మాత డీవీవీ దానయ్య. దాంతో తమను ఊరించి ఉసురుమనిపించారని, ఫ్యాన్స్ ఎమోషన్స్ తో అడ్డుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాన్సర్ట్ రిలీజ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగానే రిలీజ్ చేస్తామని ఎందుకు చెప్పారని మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు