పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ భారీ హైప్ మధ్య రెండు రోజుల క్రితం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది.
Also Read : Devara : JR. NTR దేవర 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 154 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక షేర్ పరంగాను రూ. 88 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది OG. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. వర్షాల కారణంగా కొన్ని సెంటర్స్ లో వసూళ్లు తగ్గినా డీసెంట్ కలెక్షన్స్ ను వసూలు చేయగలిగింది. రెండవ రోజు రాబట్టిన కలెక్షన్స్ తో వందకోట్ల షేర్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో చేరింది OG. ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వందకోట్ల షేర్ ఉన్న సినిమా లేదు. ఇప్పుడు ఓజి సినిమాతో తొలిసారి పవర్ స్టార్ వందకోట్ల షేర్ కొల్లగొట్టి ఆ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. నేడు, రేపు వీకెండ్ నేపథ్యంలో ఈ రెండు రోజులు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అటు ఓవర్సీస్ లోను 4.2 మిలియన్ డాలర్స్ రాబట్టింది OG.