NTV Telugu Site icon

Power Purchase: విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ..

Power

Power

రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నాయి. దీంతో.. గత్యంతరం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.

Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్, నలుగురు మృతి

కాగా.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తో విద్యుత్తు సరఫరాకు గత ప్రభుత్వం కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుంటుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు లభించే అవకాశం లేదని ఈ కారిడార్ ను గత ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. అవసరం లేకున్నా.. గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్​ చేసుకోవడంతో ప్రస్తుతం డిస్కమ్స్ పై ఆర్థిక భారం పడుతుంది. వాడినా వాడకున్నా.. పరిహారం కింద రూ. 261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్​ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్​సీ పరిధిలో ఉండగా.. పవర్​ గ్రిడ్ కార్పొరేషన్​ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.

Read Also: MP: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి