Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
- అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
- పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానుభావుడని అన్నారు. స్వాతంత్ర్య సమర కాలంలో మహాత్మా గాంధీ ‘నా వెంట 11 మంది ఉంటే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను’ అన్న మాటలను గుర్తుచేశారు. అలాంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందని ఆయన తెలిపారు.
Also Read
తాను పొట్టి శ్రీరాములు గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందలేదని, అయితే వారి కుటుంబ సభ్యులను చూడటం ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం లభించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి నడిబొడ్డున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!