Site icon NTV Telugu

Pothula Sunitha: నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ఆ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు

Pothula Sunitha

Pothula Sunitha

Pothula Sunitha: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు. అనని విషయాలను మా ఎమ్మెల్యేలు అన్నట్లు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డ ఆమె.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనే నీచమైన ఆలోచన లోకేష్‌ది అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపి మహిళల జీవితాలతో ఆడుకున్నది టీడీపీ నేతలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read Also: Koppula Eshwar: రేవంత్, ఇదీ మీ సంస్కారం.. మంత్రి ఈశ్వర్ కౌంటర్ ఎటాక్

ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి.. మహిళలను రాజకీయంగా, ఆర్ధికంగా నిలబడేటట్లు పథకాలు అమలు చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ కొనియాడారు పోతుల సునీత.. మీ పార్టీ ఆఫీసులో పని చేసే మహిళను లోకేష్ పీఏ వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందేనంటూ విమర్శలు గుప్పించిన ఆమె.. అయినా లోకేష్ ఎందుకు పీఏపై చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. టీడీపీ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు అని ఆరోపించారు. జయప్రద, దివ్యవాణి వంటి చాలా మంది మహిళలు వేధింపులకు గురి అయ్యారు.. నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పవన్ కల్యాణ్‌ టూరిస్ట్ నాయకుడు, ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు. అయితే, పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల ఆలోచనా విధానాన్ని ఆచరణలో చూపిస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు పోతుల సునీత.

Exit mobile version