Site icon NTV Telugu

TG: పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు.. ఉత్తర్వులు జారీ

Telangana

Telangana

Postings for promoted transport officers.. Govt issues orders: వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో.. రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Donald Trump: “అమెరికా నుంచి చమురు కొనాలి, లేదంటే..” యూరప్‌కి ట్రంప్ వార్నింగ్..

జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్‌కు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐ.టి జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా.. శివలింగయ్యకు అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పోస్టింగులు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Viral News: కాబోయే భార్య కోసం రూ. 55 లక్షలు ఖర్చు చేసిన భర్త.. చివరికీ..

అలాగే.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లులుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్‌ను అదిలాబాద్ డీటీసీగా.. ఎన్. వాణిని నల్గొండ డీటీసీగా.. అఫ్రీన్ సిద్దిఖీని కమిషనర్ కార్యాలయంలో డీటీసీగా.. కిషన్‌ను మహబూబ్ నగర్ డీటీసీగా.. సదానందంను రంగారెడ్డి డీటీసీగా పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version