Site icon NTV Telugu

Post Office Scheme: రూ.133 తో ఇన్వెస్ట్ చేస్తే.. చేతికి రూ.3 లక్షలు వస్తాయి..

Post Office Saving Schemes

Post Office Saving Schemes

ఎప్పుడు ఏమోస్తుందో తెలియదు.. అందుకే చాలా మంది డబ్బులను పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. అందులో ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులను పొదుపు చెయ్యాలానుకొనేవారికి పోస్టాఫీసు స్కీమ్ లు మంచివే.. ఇప్పుడు మనం చెప్పుకొనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలాను పొందవచ్చు.. పోస్టాఫిసు అందిస్తున్న బెస్ట్ స్కీమ్ లలో పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం కడుతూ పోతే సరిపోతుంది.. మీరు కట్టే డబ్బులు ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బులు కడితే ఎక్కువ లాభం వస్తుంది.

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు ఐదేళ్లు. అంటే మీరు ఐదేళ్ల వరకు డబ్బులు ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లాలి.. ఆ తర్వాత మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తం ను సొంతం చేసుకుంటారు..మీరు రోజుకు రూ. 133 పొదుపు చేయాలని భావిస్తే.. అంటే నెలకు దాదాపు రూ. 4 వేలు అవుతుంది. ఈ డబ్బులను పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ. 3 లక్షల వరకు వస్తాయి. రిస్క్ లేదు. రాబడి పక్కాగా ఉంటుంది.. మీరు ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు. మీరు రూ. 100 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు.. రిస్క్ అస్సలు ఉండదు.

ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 6.2 శాతంగా ఉండేది. అంటే గతంలో కన్నా ఇప్పుడ కాస్త అధిక రాబడి లభిస్తుందని చెప్పుకోవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.. లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. స్కీమ్‌లో చేరిన ఏడాది తర్వాత మీరు రుణం పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం రుణం కింద ఇస్తారు. తీసుకున్న రుణాన్ని ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో లేదా ఒకేసారి చెల్లించొచ్చు..పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ మెచ్యూరిటీ గడువు ఐదేళ్లు అయినా కూడా మూడేళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒవేళ మీరు ఆర్‌డీ అకౌంట్‌ను ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవాలని అనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..

Exit mobile version