Post Office Scheme: రూ.133 తో ఇన్వెస్ట్ చేస్తే.. చేతికి రూ.3 లక్షలు వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడు ఏమోస్తుందో తెలియదు.. అందుకే చాలా మంది డబ్బులను పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. అందులో ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులను పొదుపు చెయ్యాలానుకొనేవారికి పోస్టాఫీసు స్కీమ్ లు మంచివే.. ఇప్పుడు మనం చెప్పుకొనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలాను పొందవచ్చు.. పోస్టాఫిసు అందిస్తున్న బెస్ట్ స్కీమ్ లలో పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం కడుతూ పోతే సరిపోతుంది.. మీరు కట్టే డబ్బులు ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బులు కడితే ఎక్కువ లాభం వస్తుంది.
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ గడువు ఐదేళ్లు. అంటే మీరు ఐదేళ్ల వరకు డబ్బులు ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లాలి.. ఆ తర్వాత మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తం ను సొంతం చేసుకుంటారు..మీరు రోజుకు రూ. 133 పొదుపు చేయాలని భావిస్తే.. అంటే నెలకు దాదాపు రూ. 4 వేలు అవుతుంది. ఈ డబ్బులను పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ. 3 లక్షల వరకు వస్తాయి. రిస్క్ లేదు. రాబడి పక్కాగా ఉంటుంది.. మీరు ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు. మీరు రూ. 100 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు.. రిస్క్ అస్సలు ఉండదు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 6.2 శాతంగా ఉండేది. అంటే గతంలో కన్నా ఇప్పుడ కాస్త అధిక రాబడి లభిస్తుందని చెప్పుకోవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.. లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. స్కీమ్‌లో చేరిన ఏడాది తర్వాత మీరు రుణం పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం రుణం కింద ఇస్తారు. తీసుకున్న రుణాన్ని ఇన్స్టాల్మెంట్ల రూపంలో లేదా ఒకేసారి చెల్లించొచ్చు..పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ గడువు ఐదేళ్లు అయినా కూడా మూడేళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒవేళ మీరు ఆర్డీ అకౌంట్‌ను ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవాలని అనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!