Mahila Samman Savings Bond : కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్‌ను ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఏ మహిళ అయినా పోస్టాఫీసులో మహిళా సమ్మాన్ ఖాతాను తెరవవచ్చు. అదేవిధంగా, ఈ పొదుపు బాండ్‌లో ఆడపిల్ల పేరు మీద డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం మార్చి 31, 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తేదీలోపు మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
Read Also:CM KCR: రైతులను ఆదుకుంది మనమే.. ఈ విషయాన్ని వారికి చెప్పాలి
మీరు కనిష్టంగా రూ.1000 నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.5%. దాని ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదిలో రూ.16 వేలు, 2 ఏళ్లలో రూ.32 వేలు వడ్డీ లభిస్తుంది. అంటే నెలవారీగా చూస్తే రూ. 1,300ల వడ్డీ లభిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్ల ద్వారా ఆర్జించే వడ్డీపై TDS మినహాయింపు లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీ రూ.40 వేల లోపు ఉన్నందున టీడీఎస్ వర్తించదు. అదే సమయంలో ఈ మొత్తం వారి ఆదాయానికి జోడించబడుతుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది. కానీ అది సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే.
Read Also:Heat Wave Alert: ఎండ తీవ్రత, వడగాల్పులు.. అత్యవసరం అయితేనే బయకు రండి..!
