కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును హడావిడిగా పాస్ చేసి కేంద్రానికి పంపారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్డినెన్స్‌తో ఏదో జరిగినట్లు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యి నోబెల్ బహుమతి వచ్చినట్లు ఫీల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అగస్ట్ 5, 6, 7 తేదీల్లో డ్రామాలు ఆడబోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, పార్టీ తరపున రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పబోతుందని తలసాని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ బీసీ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
‘బీసీ రిజర్వేషన్లపై అగస్ట్ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం కులగణన శాస్త్రియంగా చేయలేదని మేము చెప్పాము. బీసీ బిల్లును హడావిడిగా పాస్ చేసి పంపారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్‌తో ఏదో జరిగినట్లు సంబురాలు చేసుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యి నోబెల్ బహుమతి వచ్చినట్లు ఫీల్ అయ్యారు. బీసీలకు బడ్జెట్‌లో సంవత్సరానికి 20 వేల కోట్లు అన్నారు. ఢిల్లీలో డ్రామాలు ఆడబోతున్నారు. చివరిగా కేంద్రంపై నెపం నెట్టబోతున్నారు. బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నది మా డిమాండ్. 8వ తేదీన కరీంనగర్‌లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలని సభ ద్వారా డిమాండ్ చేయబోతున్నాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
‘కాంగ్రెస్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది. మేము బీఆర్ఎస్ తరపున ఢిల్లీలో రాష్ట్రపతిని బీసీ రిజర్వేషన్లపై కలుస్తాము. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, పార్టీ తరపున రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పబోతుంది. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయం. తీర్మానం రాష్ట్రపతికి పంపించాక ఆర్డినెన్స్ ఎట్లా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మూడు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి. కార్పొరేషన్ చైర్మన్ పదవులు 50 శాతం బీసీలకు కాంగ్రెస్ ఇవ్వాలి’ అని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు.
‘తెలంగాణ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. బీసీలను అనగదొక్కుతామంటే ఊరుకొము. బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. బీసీలకు పనికిమాలిన పదవులు ఇచ్చారు. పైసల దగ్గర, కుప్పల దగ్గర మీరు తిట్లు తినే దగ్గర బీసీలను పెడుతున్నారు. బీసీలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు. దేశానికి రోల్ మోడల్ అని అంటున్నారు, ఏం రోల్ మోడల్. బీసీలను బీజేపీ మోసం చేస్తుంది. కేంద్రంలో ప్రధానమంత్రి బీసీగా ఉంటే బీసీ మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం వస్తుందని అనుకున్నాం. జయలలిత నాలుగు సార్లు ఢిల్లీకి బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని తీసుకువెళ్లారు. 80 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తే బీసీ ఒక్కరు లేరు. పదవులు, పైసలు, కాంట్రాక్టులు అన్ని మీకేనా. బీసీలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ ఒక్కటే’ అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
