NTV Telugu Site icon

Posani Krishna Murali: చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు అన్‌ఫిట్‌..!

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: మెగాస్టార్‌ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.. తాడేపల్లిలోని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్‌ అయ్యారు.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు.. అసలు రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అని వ్యాఖ్యానించారు పోసాని.

Read Also: Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక, అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదు.. ప్రజల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అన్నారు పోసాని.. చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారు.. జగన్ సంక్షేమ పాలనలో పేదలు అభివృద్ధిలోకి వచ్చారని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి..? అని ప్రశ్నించారు. ఆ పేదల కష్టాలు చూసి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని వివరించారు.. కానీ, చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుంది.. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమి సంపద సృష్టించాడు..? అని నిలదీశారు. అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏమీ చేశాడో.. జగన్ ఏమీ చేశాడో ఆలోచించాలి..? అని సూచించిన ఆయన.. అర్బన్ ఓటర్లు గ్రామాల్లోని పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధి గమనించాలని సలహా ఇచ్చారు పోసాని కృష్ణ మురళి.