NTV Telugu Site icon

Posani Krishna Murali: నాకు ప్రాణహాని ఉంది.. డీజీపీకి పోసాని ఫిర్యాదు

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: నారా లోకేష్‌ నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నేను చస్తే దానికి కారణం లోకేషే అంటూ సంచలన ఆరోపణలు చేసిన ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి.. ఈ రోజు ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ వల్ల నాకున్న ప్రమాదాన్ని డీజీపీకి చెప్పాను.. టీడీపీలో చేరమని నన్ను అడగటం, నేను నిరాకరించటం జరిగింది.. దీంతో లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందని.. నాకు తెలిసినవాళ్లు నన్ను హెచ్చరించారు.. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లానని వెల్లడించారు.. నాకు భద్రత కల్పిస్తానని డీజీపీ భరోసా ఇచ్చారని తెలిపారు పోసాని కృష్ణ మురళి.

Read Also: Vikarabad: కస్టమర్ పై దాడి చేసి కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది

ఇక, ఎన్టీ రామారావునే వేసిన వాడు చంద్రబాబు.. నేనెంత? అని ప్రశ్నించారు పోసాని.. కాపు వర్గంపై ప్రేమ ఉందని చంద్రబాబు అంటున్నాడు.. నా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం చేస్తున్నాం.. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తాను అని చంద్రబాబు చెప్పగలడా? అంటూ సవాల్‌ విసిరారు.. హత్య చేసే వాడు ఆధారాలు ఇస్తాడా? రామారావుకు వెన్నుపోటు పొడిచే ముందు చంద్రబాబు చెప్పాడా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. జీవితంలో పోటీ చేయను.. టికెట్ ఇచ్చినా గెలువలేను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పోసాని.. సీఎం వైఎస్‌ జగన్ అంటే నాకు పిచ్చి, ప్రాణం.. కానీ, లోకేష్ తో నేను తూగ గలనా..? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, బట్టలు విప్పదీసి ఏం చూస్తారు? ప్రతిపక్ష నేతలు ఎందుకు ఇలా మాట్లాడతారు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి.

Show comments