Site icon NTV Telugu

Posani Krishna Murali: చంద్రబాబు మెంటల్లీ సిక్.. పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు, పిచ్చోడు

Posani

Posani

మన దేశానికి ఒక్కరే గాంధీ ఉంటే.. ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు జూనియర్ గాంధీలున్నారు ఉన్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఏపీలో భర్తలను మించిపోయిన ఇద్దరు మహిళా నాయకులను చూస్తున్నాం.. అత్తకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మిణి.. మా ఆయన నిజాయితీ పరుడు.. మాకేం తక్కువ డబ్బు కాజేయడానికి అని భువనేశ్వరి అంటున్నారు.. కొడుకు నాశనం కావడానికి భువనేశ్వరినే కారణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు పంపడానికి కారణం జగనా.? జడ్జా.? చట్టం కదా జైలుకు పంపింది.. బాబును జైలుకు పంపాలి అనుకుంటే నాలుగేళ్ల క్రితమే పంపేవాళ్లు అని పోసాని అన్నారు.

Read Also: Gandhi Jayanti: గాంధీజీని మొదటిసారి మహాత్మా అని పిలిచింది ఎవరో తెలుసా..!?

మీ నాన్నని వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ఆపలేవు అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని మీరే ఏలాలి అని అనుకుంటున్నారు.. మా సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయల్లోకి వచ్చాడు.. సమసమాజ స్థాపన అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టాడు పవన్ అని ఆయన మండిపడ్డాడు. సామాజిక న్యాయం.. అవినీతి లేని సమాజం అని రాజకీయాల్లోకి వచ్చాడు.. పాపం పవన్ చాలా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చాడు.. చంద్రబాబు, లోకేష్ ఎంత ఘోరాలు చేస్తున్నారో పవన్ చెప్పి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తానంటాడు అని పోసాని కృష్ణమురళి అన్నారు.

Read Also: RBI MPC Meeting: రుణ భారం పెరుగుతుందా లేదా ఉపశమనం ఉంటుందా? రెపో రేటుపై ఆర్‌బీఐ నిర్ణయం ఏంటి?

జగన్ చేసినవి చెప్పు పవన్.. నిన్ను మీ ఇంట్లో వాళ్లని జగన్ ఎప్పుడైనా తిట్టడా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. మీ మొగుళ్లుని అమ్మనా బూతులు తిట్టిన పవన్ ని పిలిచి.. టీ తాగుతావా? కాఫీ తాగుతావా అంటున్నారు.. మా ఆయన్ని ఎందుకు.. ఏ ఆధారాలతో తిట్టావు అని అంటారు అనుకున్నా.. పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు.. పిచ్చోడు.. లేడీస్ అడిగారు కదా.. మీ కోసం నేను మీకు సపోర్ట్ చేస్తా అన్నాడు పవన్.. కాపు ఓట్ల కోసం అత్తకోడళ్లు పవన్ తో డ్రామా ఆడారు.. భర్తలను తిట్టారని మర్చిపోయి ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ని కలిశారు అత్తకోడళ్లు.. ఆధారాలు చూసి బాబును జడ్జి జైలుకు పంపిస్తే జడ్జిని తిట్టారు అని ఆయన వెల్లడించారు.

Read Also: Minister KTR: ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌.. నిర్మాణానికి భూమిపూజ చేసిన కేటీఆర్‌

చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి జైలుకు తీసుకువస్తావా పవన్? పోసాని కృష్ణమురళి అడిగారు. అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పవన్?.. కాపు నాయకుడ్ని, లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా పవన్.. కాపు వ్యతిరేకి చంద్రబాబు.. మీరు ఎవర్నైనా ఎన్నుకోండి.. ఎవరికైనా ఓట్లు వేయండి కానీ చంద్రబాబుకు వేయకండి అని ఆయన కోరారు. నేను ఎన్నికల్లో నిల్చుంటే నాతోని అన్నారు.. మురళీ ఎందుకు కాపు పార్టీలో నిల్చున్నావు అని.. జగన్ ఎప్పుడు కులం వర్గం మతం అని ఎప్పుడూ అనలేదు.. దుర్మార్గుడైన చంద్రబాబుకు సపోర్ట్ చేయకు పవన్ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఒక లైన్ తో జనాల్లోకి వెళ్లు చరిత్రలో నిలిచిపోతావు.. మీ అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు టికెట్ ఇచ్చారు అని పోసాని పేర్కొన్నారు.

Read Also: Shraddha Das: సరికొత్త పోజులతో ఆకట్టుకుంటున్న.. శ్రద్ధా దాస్

నువ్వు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పు అని పోసాని కృష్ణమురళి అన్నారు. అత్తకోడళ్లు ఇద్దరు కలిసి నిన్ను ఐస్ చేయగానే వాళ్లకి హామీలు ఇచ్చావు.. బ్రాహ్మిణి అమాయకురాలా? మీ ఆయన మీ మామయ్య మీరు కాదు ఒంటరైంది మీ తాత.. బాబు జైలుకెళ్తే ఇంతలా చేస్తున్నారే.. ఎన్టీఆర్ చనిపోతే కనీసం ఏడ్చారా?.. కాపులు ఎవ్వరి మాట వినకండి.. ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు అని ఆలోచించండి.. కాపులని రిక్వెస్ట్ చేస్తున్న ఆలోచించండి.. మీరు ఎన్ని సార్లు మోసపోయారో తెలుసుకోండి.. హెరిటేజ్ చంద్రబాబు పెట్టిందా? ఆయన కష్టపడి పెట్టాడా.. మా సినిమా లెజెండ్ నుంచి హెరిటేజ్ ని కబ్జా చేశాడు.. హెరిటేజ్ ఓనర్ ని వెన్నుపోటు పొడిచాడు.. దోచుకున్నాడు.. సత్యమేవ జయతే అనే దీక్ష చేయకండి.. సత్యం లేంది దీక్ష ఎందుకండి.? అని పోసాని ప్రశ్నించారు.

Exit mobile version