NTV Telugu Site icon

Donald Trump: చిరుధాన్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రపటం.. విశాఖ చిత్రకారుడి ప్రతిభ

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్ ఉపయోగించి ట్రంప్ చిత్రపటాన్ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షునిగా రెండో పర్యాయం ఎన్నికైన సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఎంతో సహజసిద్ధంగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. విజయ చిహ్నాన్ని చూపుతున్నట్టుగా ట్రంప్ చిత్రం వెనుక భాగంలో అమెరికా జెండాను సైతం తీర్చిదిద్దారు. భారత అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని మనసారా కోరుకుంటూ ఈ విధంగా అమెరికా అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విజయకుమార్ చెప్పారు. విశాఖ చిత్రకారుడి ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.

Read Also: Trump-Yunus: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో హిందువులకు మంచి రోజులు?

డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాకు కొత్త అధ్యక్షుడు లభించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మెజారిటీ మార్కును దాటేసి 277 సీట్లు గెలుచుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 226 సీట్లు వచ్చాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అభినందనలు తెలిపారు.

Show comments