Site icon NTV Telugu

Fake Certificate : ఇక ఫేక్‌ సర్టిఫికెట్లకు చెక్‌.. పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

Fake Certificate

Fake Certificate

కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలు చదివినట్లు బోగస్‌ సర్టిఫికెట్లను పుట్టిస్తున్నారు. ఆయా యూనివర్సిటీల్లోని కొందరు డబ్బుకు ఆశపడి ఈ నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ వెలుగులో వస్తున్నాయి. అయితే.. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల బెడదకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ పూనుకుంది. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల తనిఖీకి పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు పొందినట్లు ధృవీకరణ పత్రాలు సృష్టించి డబ్బు దండుకుంటున్నారు మోసగాళ్లు.
Also Read : Sajjala Ramakrishna: ఎవరైనా చంద్రబాబు భార్యని అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?

అయితే.. ఇటీవల కాలంలో ఈ నకిలీ సర్టిఫికెట్ల తంతు పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది ఉన్నత విద్యామండలి. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి గత పన్నెండేళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు వివరాలను ఈ పోర్టల్ లో నిక్షిప్తం చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. అయితే.. రాష్ట్రంలో బోగస్‌ సర్టిఫికెట్లను గుర్తించడానికి ఏర్పాటు చేసిన పోర్టల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ప్రారంభించనున్నారు.

Exit mobile version