NTV Telugu Site icon

Pune car Accident: మైనర్‌కు బెయిల్ మంజూరులో ట్విస్ట్! కమిటీ ఏం తేల్చిందంటే..!

Cea

Cea

పూణె కారు ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మద్యం మత్తులో మైనర్ కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలు తీశాడు. అనంతరం గంటల వ్యవధిలోనే మైనర్ నిందితుడికి బెయిల్ రావడం.. అలాగే ప్రమాదంపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం.. ఇదంతా తీవ్ర దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడంతో నిందితుడికి కోర్టు బెయిల్ రద్దు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ దర్యాప్తులో మెడికల్ రిపోర్టులు తారుమారు చేయడంతో వారిని సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కోర్టు తీరుపై కూడా కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఈ సందర్భంగా మైనర్ బెయిల్ విషయంలో లోపాలు ఉన్నట్లుగా తాజాగా గుర్తించింది.

ఇది కూడా చదవండి: Cm Revanth Reddy: మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

బెయిల్‌ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ‘‘నిందితుడికి బెయిల్‌ మంజూరు సమయంలో జేజేబీలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. మరుసటిరోజు మరొకరు తన సమ్మతి తెలియజేశారు. నిబంధనలు పాటించకపోవడం, దుష్ర్పవర్తన వంటివి ఈ ఇద్దరు సభ్యుల విషయంలో కమిటీ గుర్తించింది. లోపాలు స్పష్టంగా ఉన్నందునే జేజేబీ బెంచ్ మరుసటిరోజు బెయిల్‌ను రద్దు చేసినట్లు విచారణలో తేలింది’’ అని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Exercise Time: ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎంత సమయం వ్యాయామం చేయాలంటే..

సభ్యులిద్దరి వాంగ్మూలాలనూ కమిటీ నమోదు చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశామని, నాలుగైదు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించామని డబ్ల్యూసీడీ కమిషనర్ తెలిపారు. జేజేబీలో ఒక జ్యుడీషియల్‌, ఇద్దరు నాన్‌జ్యుడీషియల్‌ సభ్యులు ఉంటారు. నాన్‌జ్యుడీషియల్‌ సభ్యులను రాష్ట్ర మహిళాశిశు అభివృద్ధి విభాగం నియమిస్తుంది.

ఇది కూడా చదవండి: Kate middletons: కేట్ మిడిల్టన్ ప్రత్యక్షం.. నవ్వుతూ కనిపించిన యువరాణి