NTV Telugu Site icon

Firing On Famous Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. గతంలో సల్మాన్ ఖాన్ పై ఫైరింగ్ చేసిన గ్యాంగే!

Ap Dhillon

Ap Dhillon

‘బ్రౌన్ ముండే…’, ‘సమ్మర్ హై…’ ఫేమ్ సింగర్ ఏపీ ధిల్లాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ గాయకుడి ఇంటిపై కాల్పులు జరిగాయి. సింగర్ ఇల్లు కెనడాలోని వాంకోవర్‌లో ఉంది. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే.. ఈ సంఘటన సెప్టెంబర్ 1 న జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అతడు ఇంటి బయట గుర్తుతెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్
గోదారా ఈ దాడికి బాధ్యత వహించాడు. దీనికి సంబంధించిన పోస్త్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ MORE: Chirag Paswan: కేంద్రమంత్రి కారుకి రూ.2 వేల చలానా.. అతి వేగమే కారణం!

కెనడాలోని ఏపీ థిల్లాన్ ఇంటి వెలుపల జరిగిన దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదారా బాధ్యత వహించినట్లు వాదిస్తున్నారు. అన్నదమ్ములందరికీ రామ్ రామ్ జీ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. “సెప్టెంబరు ఒకటిన రాత్రి, మేము కెనడాలోని రెండు ప్రదేశాలలో కాల్పులు జరిపాము. వాటిలో విక్టోరియా ఐలాండ్, వుడ్‌బ్రిడ్జ్ టొరంటో ఉన్నాయి. ఈ దాడికి లారేష్ బిష్ణోయ్ గ్రూప్ బాధ్యత వహిస్తుంది.” అని వైరల్ అవుతున్న పోస్ట్ లో ఉంది. భద్రతా సంస్థ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. కాల్పుల్లో నిజానిజాలు తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై కెనడా పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి ముందు కూడా.. గోల్డీ-లారెన్స్ గ్యాంగ్ కొన్ని నెలల క్రితం గాయకుడు గిప్పీ గ్రేవాల్ యొక్క విదేశీ ఇంటిపై కాల్పులు జరిపారు.

READ MORE:Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..

సల్మాన్ ఇంటిపై కూడా కాల్పులు ..
ఇటీవల సల్మాన్ ఖాన్‌తో కలిసి ఏపీ ధిల్లాన్ పాట విడుదలైంది – ఓల్డ్ మనీ.. పాట విడుదలై మూడు వారాలు మాత్రమే గడిచింది. ఈ పాటకు విశేష ఆదరణ లభించింది. యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షణలు వచ్చాయి. ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. కొన్ని నెలల క్రితం.. తెల్లవారుజామున సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ బాధ్యత వహించింది. దీంతో సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.