NTV Telugu Site icon

YouTuber: చిక్కుల్లో చెన్నై యూట్యూబర్.. భార్యతో దుబాయ్ వెళ్లి ఏం చేశాడంటే..!

Dke

Dke

చెన్నైకి చెందిన ప్రముఖ యూట్యూబర్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా అతడు అప్‌డేట్ చేసిన ఓ వీడియో ఇరకాటంలో పడేసింది. గర్భవతి అయిన భార్యను దుబాయ్ తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్ష చేయించడమే కాకుండా.. అదేదో గొప్ప అయినట్లు డాక్టర్ తెలియజేసిన మాటలు.. స్కానింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు వీక్షించి అభినందించడం ఒకెత్తు అయితే.. ఆ వీడియో కాస్త ఆరోగ్య శాఖ అధికారులకు చేరడంతో యూట్యూబర్‌కు నోటీసులు పంపించింది.

ఇది కూడా చదవండి: Bangladesh MP: కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ మిస్సింగ్.. హత్యకు గురైనట్లు పోలీసుల అనుమానం..

లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం భారతదేశంలో చట్టరీత్యా నేరం. స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు. ఒకవేళ చేసినా వైద్యుడు గోప్యంగా ఉంచి పరీక్షించాలే తప్ప తెలియజేయకూడదు. లేదంటే నేరంగా పరిగణించబడుతుంది. అలాంటిది చెన్నైకి చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్‌ ఇర్ఫాన్.. తన భార్యను దుబాయ్ తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు. దుబాయ్‌లో చేయించిన స్కానింగ్ దృశ్యాలు.. డాక్టర్ తెలియజేసిన మాటలను.. జెండర్ రివీల్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. 2 మిలియన్ల మంది వీక్షించారు. పుట్టబోయే బిడ్డ లింగాన్ని తెలియజేయడంతో తాజాగా ఇర్ఫాన్ ఇబ్బందుల్లో పడ్డారు.

ఇది కూడా చదవండి: Sania Mirza: నేమ్‌ప్లేట్‌ లో పేర్లని మార్చేసిన సానియా మీర్జా.. సానియా ఇజాన్‌ అంటూ..

పుట్టబోయే బిడ్డ లింగాన్ని బహిర్గతం చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. ప్రీ కాన్సెప్షన్ & ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హమైనది. ఈ చట్టం లింగ ఆధారిత అబార్షన్‌లను నిరోధించడం మరియు పుట్టబోయే పిల్లల భద్రత, హక్కులను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. భ్రూణహత్యలను నిరోధించడానికి భారతదేశంలో 1994లో చట్టం చేయబడింది. ఈ చట్టం కింద తమిళనాడు ఆరోగ్య శాఖ ఇర్ఫాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వీడియోను తొలగించాలని ఆరోగ్య శాఖ.. సైబర్ పోలీసు విభాగానికి లేఖ కూడా రాసింది. చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి.. ఇర్ఫాన్‌కి నోటీసు పంపారు. ఇలాంటి చర్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆడపిల్లల పుట్టుక తగ్గడానికి దారితీయవచ్చని ఒక ప్రకటన పేర్కొంది.

తాను వీడియోను తీసివేసానని.. నోటీసు అందిన తర్వాత దానికి సమాధానం ఇస్తానని యూట్యూబర్ ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఈ వీడియోను చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే పలువురు విమర్శించారు.

ఇది కూడా చదవండి: Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..