Site icon NTV Telugu

Anchor Swetcha: పూర్ణచందర్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..

Purnachandar

Purnachandar

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు. పూర్ణచందర్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పూర్ణ చందర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. కన్ఫషన్ స్టేట్మెంట్ లో రాజకీయ నాయకుడి పేరు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు సంబందించిన అన్ని విషయాలు ఒక రాజకీయ నాయకుడికి తెలుసని పూర్ణ చందర్ చెప్పినట్లు సమాచారం.

Also Read:Manchu Vishnu : అతని వల్లే కన్నప్ప వాయిదా వేశా.. మంచు విష్ణు సీక్రెట్ రివీల్..

నన్నేం చేయలేవు స్వేచ్ఛ.. అంటూ బెదిరించినట్లు సమాచారం. స్వేచ్చను భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి, పెళ్లి చేసుకుంటానని పూర్ణ మోసం చేసినట్లు తెలుస్తోంది. పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చింది స్వేచ్ఛ.. ఆ తర్వాత పలుమార్లు పెళ్లి చేసుకోవాలని నిలదీసింది స్వేచ్ఛ.. పెళ్లి ప్రస్తావనను దాట వేస్తూ వచ్చిన పూర్ణచందర్.. వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ కి స్వేచ్ఛ.. పూర్ణ చందర్ వచ్చారు.

Also Read:Stipend: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన స్టైపెండ్

అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మరో సారి గొడవ జరిగింది. పూర్ణ చందర్ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పినట్లు విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. నన్నేం చేయలేవు.. నాకు రాజకీయ అండ దండలు ఉన్నాయని పూర్ణచందర్ బెదిరించినట్లు తెలుస్తుంది. స్వేచ్ఛతో రిలేషన్ లో ఉన్న విషయం రాజకీయ నాయకుడికి తెలుసు అని పూర్ణ చందర్ చెప్పినట్లు సమాచారం.

Exit mobile version