Site icon NTV Telugu

Himanta Biswa Sarma: రాహుల్‌ గాంధీ నిరక్షరాస్యుడైన పిల్లవాడు.. హిమంత సంచలన వ్యాఖ్యలు

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: రాజవంశ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని రాహుల్ గాంధీని విమర్శించారు. వంశపారంపర్య రాజకీయాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నిందించారు, రాజకీయాలపై అవగాహన లేని ‘అన్‌పద్ బచ్చా’ (నిరక్షరాస్యుడైన పిల్లవాడు) అని అభివర్ణించారు.

మంగళవారం మిజోరంలో ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు బీసీసీఐలో ఉన్న పదవులను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. “అమిత్ షా కొడుకు ఏం చేస్తాడు?.. అసలు ఏం చేస్తున్నాడు? రాజ్‌నాథ్‌సింగ్ కొడుకు ఏం చేస్తాడు?.. చివరిగా నేను విన్నది అమిత్ షా కొడుకు భారత క్రికెట్‌ని నడుపుతున్నాడని.. బీజేపీలోని నేతలను చూసి మీరే ప్రశ్నించుకోండి. వారి పిల్లలు ఏమి చేస్తున్నారు? వారి పిల్లలలో చాలా మంది రాజవంశీయులు.” అని రాహుల్‌ గాంధీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హోంమంత్రి కుమారుడు జైషా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండగా, రాజ్‌నాథ్‌ సింగ్ కుమారుడు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Also Read: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్‌ పుర్కాయస్థ

రాహుల్ గాంధీ వంశపారంపర్య రాజకీయాలకు ఉదాహరణగా జైషా, అనురాగ్ ఠాకూర్, పంకజ్ సింగ్ (రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు)లను ఉదహరించారు. దీనికి ప్రతిగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వంశపారంపర్య రాజకీయాల అర్థాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. బీసీసీఐని బీజేపీ వింగ్ అని రాహుల్‌ భావిస్తున్నాడని.. అతను ఒక ‘నిరక్షరాస్యుడైన పిల్లవాడు’ అని హిమంత బిస్వా శర్మ విమర్శించారు. రాహుల్ గాంధీ నిరక్షరాస్యుడని, వంశ రాజకీయాలకు అర్థం తెలియదని హిమంత బిస్వా శర్మ అన్నారు.

“మొదట, ఇది వంశపారంపర్య రాజకీయమైతే, దాని అర్థం రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలి. అమిత్ షా కుమారుడు బీజేపీలో లేడు, కానీ అతని (రాహుల్ గాంధీ) కుటుంబం మొత్తం కాంగ్రెస్‌లో ఉంది, కాబట్టి అతను ఈ రోజు దూషించాడు. అన్నింటికీ తానే ప్రధాన కారణమని అతనికి తెలియదు. కాబట్టి ఒక కుటుంబం.. అమ్మ, నాన్న, తాత, సోదరి అందరూ రాజకీయాల్లో ఉండి పార్టీని నియంత్రిస్తూ ఉంటే దానికి సమాంతరం ఎక్కడ చూస్తారు?. రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు ప్రియాంక గాంధీలా బీజేపీని నియంత్రించలేరని..” హిమంత బిస్వా శర్మ అన్నారు.

Exit mobile version